News12th Nov 05:27 PMSunil Byrisetty1 min read
ఏపీ అంటే అభివృద్ధే కాదు ఉద్యోగాలు కూడా!
చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి ఉద్యోగాల కల్పనకు గట్టిగా కృషి చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. ఈ రెండున్నరేళ్ళలో దాదాపు రూ.20 లక్షల
చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి ఉద్యోగాల కల్పనకు గట్టిగా కృషి చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. ఈ రెండున్నరేళ్ళలో దాదాపు రూ.20 లక్షల కోట్లు పైగా పెట్టుబడులతో అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పరిశ్రమలు, పోర్టులు నిర్మిస్తూ లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ప్రభుత్వోద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ ప్రకారమే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, ఇటీవలే మరో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రూప్-2లో 686 పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఖాళీ అయిన మరో 34 పోస్టులు కూడా జోడించి మంగళవారం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో డీఎస్సీ ద్వారా2,721 పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా 720 పోస్టులు కలిపి మొత్తం 3,441 పోస్టులు భర్తీ చేయబోతోంది.