News10th Oct 01:17 PMSunil Byrisetty1 min read

పరిశ్రమలు–ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఐటీఐల బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటీఐ) బలోపేతం చేయడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థల మధ్

పరిశ్రమలు–ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఐటీఐల బలోపేతం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటీఐ) బలోపేతం చేయడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థల మధ్య సమన్వయం అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడలో జర్మన్ అంతర్జాతీయ సహకార సంస్థ GIZ ఆధ్వర్యంలో నిర్వహించిన GreenSkills+ ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి, ఐటీఐలలో ఆధునిక శిక్షణా పద్ధతుల అమలు, పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరుల తయారీపై పారిశ్రామిక ప్రతినిధులు తమ సూచనలు అందించారు. ఈ సమావేశంలో పలు సంస్థల అధినేతలు పాల్గొని ఐటీఐల బలోపేతానికి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, శిక్షణా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యవంతమైన యువతను తయారు చేసి, క్లీన్ ఎనర్జీ రంగంలో ఉపాధి అవకాశాలను విస్తరించవచ్చని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Scroll for the next article