News27th Jul 01:36 PMSunil Byrisetty1 min read
చట్ట సభలకు వివిధ కమిటీల ఏర్పాటు
చట్ట సభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. స్
చట్ట సభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు-పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు.
బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీని నియమించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు.
మిర్యాల శిరీషదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరు చరిత అధ్యక్షతన మహిళ-శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీలు ఏర్పాటయ్యాయి. తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీని నియమించారు.