Education13th Jul 04:09 PMSunil Byrisetty1 min read

రాష్ట్రానికి మరో 175 ఎంబీబీఎస్ సీట్లు

రాష్ట్రానికి మరో 175 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్ల‌తో NMC తొలి అనుమతి లభించిందన్నారు. విజయవాడ ప్ర

రాష్ట్రానికి మరో 175 ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రానికి మరో 175 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్ల‌తో NMC తొలి అనుమతి లభించిందన్నారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థకు అదనంగా 75 సీట్లను NMC మంజూరు చేసిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే 275 సీట్లు.. మూడేళ్లలో కలిపి 455 సీట్ల పెంపు కానున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య విద్య విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత‌నిస్తోంది. ఎన్ఎంసి నిబంధనలకనుగుణంగా ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకాలు, వైద్య పరికరాల ఏర్పాటు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ నిరంతరం సమీక్షలు నిర్వహించారు. అదే ప్రణాళికాబద్ధమైన కృషి ఇప్పుడు వరుసగా సీట్ల పెంపు రూపంలో ఫలిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో కడప ప్రభుత్వ వైద్య కళాశాల 75, పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 100 సీట్లు, విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల 75, నెల్లూరు ప్రభుత్వ వైద కళాశాలకు 25 సీట్లు చొప్పున NMC మంజూరు చేసింది.
Andhra Pradesh
MBBS Seats
NMC
Medical Education
Satya Kumar Yadav
Government Medical College
Piduguralla Medical College
Vijayawada Siddhartha Medical College
Scroll for the next article