News30th Sep 10:13 AMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో మరో 2 వస్తువులు

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందించనున్న ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ లో మరిన్ని వస్తువులు చేర్చుతున్నట్టు తెలిపింది. ఇటీవలే బేబీ క

ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో మరో 2 వస్తువులు
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందించనున్న ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ లో మరిన్ని వస్తువులు చేర్చుతున్నట్టు తెలిపింది. ఇటీవలే బేబీ కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు అదనంగా ఫోల్డబుల్‌ బెడ్, బ్యాగును అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో బేబీ కిట్‌ అదనపు వస్తువులను ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పథకం కింద ప్రతి ఏడాది 3.20 లక్షల మంది తల్లులకు ఈ ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. శిశు ఆరోగ్య సంరక్షణ కోసం 2016లో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
Andhra Pradesh
NTR Baby Kit
Free Scheme
Mothers
Newborn Care
Foldable Bed
Bag
Chandrababu Naidu
Health Department
ప్రభుత్వ ఆసుపత్రులు
సంక్షేమ పథకం
టీడీపీ ప్రభుత్వం
Scroll for the next article