News21st Mar 05:45 PMSunil Byrisetty1 min read

ఉచిత గ్యాస్ డబ్బులు పడలేదా.. ఇలా చేస్తే చాలు

దీపం 2 పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీ డబ్బులు కొందరికి జమ కావడం లేదు. సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాల నమోదులో చిన్నచిన్న తప్పులతో లబ్ధిదారులకు రాయితీ డబ్బులు రావడం లేదు

ఉచిత గ్యాస్ డబ్బులు పడలేదా.. ఇలా చేస్తే చాలు
దీపం 2 పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీ డబ్బులు కొందరికి జమ కావడం లేదు. సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాల నమోదులో చిన్నచిన్న తప్పులతో లబ్ధిదారులకు రాయితీ డబ్బులు రావడం లేదు. ఈ క్రమంలో అధికారులు రాయితీ డబ్బులపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఏప్రిల్‌-జులై, ఆగస్టు-నవంబరు, డిసెంబరు- మార్చి నెలల మధ్య ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తుంది. ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు రాయితీ అందిస్తోంది. మార్చి 31 వరకు తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు మొదటి సిలిండర్ బుక్‌ చేసుకున్నా రాయితీ డబ్బులు బ్యాంకు అకౌంట్‌లలో పడలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ కాకపోవడం, ఒకే బియ్యం కార్డుపై రెండేసి గ్యాస్‌ కనెక్షన్లు ఉండటం వంటి కారణాలతో రాయితీ డబ్బులు అకౌంట్‌లలో జమ కావడం లేదంంటున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే.. 1967 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేస్తే పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. అయితే లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకున్నా, ప్రతినెలా రేషన్‌ తీసుకోకపోయినా, 300 యూనిట్లకు పైగా విద్యుత్తు వినియోగం, కారు ఉండటం, ప్రభుత్వ ఉద్యోగైన వారికి దీపం పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు.
Deepam 2 Scheme
Free Gas Cylinder
ప్రభుత్వం
Scroll for the next article