News16th Dec 11:10 AMSunil Byrisetty1 min read

క్రికెటర్ శ్రీ చరణికి ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం

ప్రపంచకప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. రూ. 2.50 కోట్ల నగదు పురస్కారంతోపాటు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చే

క్రికెటర్ శ్రీ చరణికి ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం
ప్రపంచకప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. రూ. 2.50 కోట్ల నగదు పురస్కారంతోపాటు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మహిళల ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. అంతేకాకుండా, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తింపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందించింది.
Andhra Pradesh Government
Sri Charani
Women’s Cricket
ICC Women’s World Cup
Cash Reward
House Site Allocation
Group-1 Job
Kadapa District
భారతీయ మహిళా క్రికెటర్లు
క్రీడా సాధనలు
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
Scroll for the next article