News9th Sep 03:46 PMSunil Byrisetty1 min read

విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం

పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024–29 స

విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం
పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024–29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్‌షోరూమ్ ధరలో 5 శాతం వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఈవీల వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh
EV Policy
Mandipalli Ramprasad Reddy
Electric Vehicles
Sustainable Electric Mobility Policy
EV Incentives
Electric Vehicle Subsidy
Electric Two Wheelers
ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు
రోడ్ ట్యాక్స్ మినహాయింపు
ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు
గ్రీన్ మొబిలిటీ
సుస్థిర రవాణా
Scroll for the next article