News30th Mar 09:35 AMSunil Byrisetty1 min read

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు ఉగాది పురస్కారం

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారం(జర్నలిజం విభాగం) ప్రకటించింది. అంకబాబు 74 ఏళ్ల క్రితం ఎలాంటి సదుపాయాలు లేదా సౌకర్యాలు

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు  ఉగాది పురస్కారం
సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారం(జర్నలిజం విభాగం) ప్రకటించింది. అంకబాబు 74 ఏళ్ల క్రితం ఎలాంటి సదుపాయాలు లేదా సౌకర్యాలు లేని.. ప్రకాశం జిల్లా లోని చంద్రశేఖరపురం అనే ఓ కుగ్రామంలో జన్మించారు. తండ్రి కొల్లు వెంకటాద్రి నాయుడు మంచి ధనవంతులు, గ్రామ మునసబు భాద్యతలు నిర్వహిస్తూ గ్రామ పెద్దగా ఉండేవారు. బాల్యం నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన అంకబాబు నాయకుడిగా ఎదిగారు. తను జన్మించిన గ్రామంలో తాను చదివిన స్కూల్ కు 12 ఎకరాల తన స్వంత వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చి కొత్త హై స్కూల్ నిర్మాణం, ఆ తదుపరి అందులోనే ఇంటర్మీడియట్ కాలేజీ వచ్చేందుకు కృషి చేశారు. అంకబాబు BA LLB పూర్తి చేసి ఒంగోలులో న్యాయవాద వృత్తి ప్రారంచించారు. జర్నలిజంపై మక్కువతో రామోజీ రావు పిలుపు మేరకు.. ఈనాడులో చేరి కొత్త భవనాల నిర్మాణంలో రామోజీరావుకి చేదోడువాదోడుగా నిలబడ్డారు. ఒక ప్రక్క ఎడిషన్ భాద్యతలు చూస్తూనే ఈనాడు కొత్త భవనాల నిర్మాణాలలో కీలక పాత్ర పోషించారు. తదుపరి ఉదయంలో ప్రస్థానం ప్రారంభించి స్వర్గీయ దాసరి నారాయణ రావుకి, ఆ తదుపరి స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డికి ఆత్మీయుడిగా మెలిగి ఉదయం భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. వందలాది తన జర్నలిస్ట్ శిష్యులకు, సహచరులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ 74 ఏళ్ల వయస్సులో నిజమైన, నిఖార్సైన మరియూ అత్యంత ఆదర్శవంతమైన జర్నలిస్ట్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న అంకబాబుకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజంలో కళారత్న పురష్కారం కొరకు ఎంపిక చేయడం అత్యంత సముచితం.
Ugadi
Andhra Pradesh
Government
Kala Ratna Awards
సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు
Scroll for the next article