Politics18th Jul 02:19 PMSunil Byrisetty1 min read
మళ్లీ మొదలైన పదవుల పండుగ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి నామినేటెడ్ పదవుల పండుగ మొదలైంది. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తూ ప్రకటన విడుదలైంది. వీటిలో టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయి
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి నామినేటెడ్ పదవుల పండుగ మొదలైంది. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తూ ప్రకటన విడుదలైంది. వీటిలో టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయించారు. ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీలకు 10 పదవులు దక్కాయి. అలాగే ఎస్టీలకు 5, మైనార్టీలకు 5 పదవులు లభించాయి. ఈ నామినేటెడ్ పదవుల్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా 35 మంది మహిళలకు అవకాశం కల్పించారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొల్లు పెద్దిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ గెలుపు కోసం పనిచేసినవారికి అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ కానున్నాయి.