Politics18th Aug 10:20 AMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ సారించింది. అక్టోబర్ లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఈ మేరకు సీఎం ఆఫీస్ ఆదేశాలు జారీ చేసి

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ సారించింది. అక్టోబర్ లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఈ మేరకు సీఎం ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించింది. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. 23 పుర, నగరపాలక సంస్థల, నగర పంచాయతీలకు సంబంధించిన, 200 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కేసులు పెండింగ్ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు, 13,356 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో సూచించింది. బీసీ రిజర్వేషన్లు, చట్ట సవరణలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Andhra Pradesh
Local Body Elections
Panchayat Elections
Municipal Elections
October Elections
AP Government
Chief Minister’s Office
సీఎంవో
పంచాయతీరాజ్ శాఖ
పురపాలక శాఖ
బీసీ రిజర్వేషన్లు
ఎన్నికల ఏర్పాట్లు
గ్రామ పంచాయతీలు
పట్టణ స్థానిక సంస్థలు
Scroll for the next article