National27th Aug 12:07 PMSunil Byrisetty1 min read

నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల క్షేమమే లక్ష్యం

నేపాల్ లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న వారిలో తెలుగు వారు.. ప్రత్యేకించి ఏపీ వాసులు ఎవరైనా ఉన్నారా అని ఆ

నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల క్షేమమే లక్ష్యం
నేపాల్ లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న వారిలో తెలుగు వారు.. ప్రత్యేకించి ఏపీ వాసులు ఎవరైనా ఉన్నారా అని ఆర్టీజీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రీకుల బృందం ఖాట్మాండులో ఉన్నట్టు ఆర్టీజీఎస్ గుర్తించింది. ఎలాంటి సహయం అవసరమైన తక్షణం తమను సంప్రదించాలని యాత్రీకులకు ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. తామందరం క్షేమంగానే ఉన్నామని యాత్రికులు తెలిపారు. మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లు ప్రకటించారు. ఏపీ భవన్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ — న్యూఢిల్లీ 1. 011-23384016 2. 011-23387089 3. Whatsapp: 9059824101
Andhra Pradesh Government
Nepal Floods
AP Pilgrims
Manasarovar Yatra
Kathmandu
RTGS
AP Bhavan
Pilgrims Safety
Flash Floods
ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్
తెలుగు యాత్రికులు
నేపాల్ విపత్తు
ప్రయాణ భద్రత
Scroll for the next article