News19th Oct 03:41 PMSunil Byrisetty1 min read

చట్ట సభలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

చట్ట సభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ అయ్

చట్ట సభలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
చట్ట సభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు-పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్ల కుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీషదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరు చరిత అధ్యక్షతన మహిళ-శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను నియమించారు.
Andhra Pradesh
Legislative Assembly
Committees
Government Order
AP Politics
Welfare Committees
BC Welfare
ఎస్టీ సంక్షేమం
మైనార్టీ సంక్షేమం
మహిళా మరియు శిశు సంక్షేమం
Scroll for the next article