News25th Oct 02:17 PMSunil Byrisetty1 min read
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత జీవో జారీ
“ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఉపవర్గీకరణ) చట్టం, 2025” ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. షెడ్యూల్డ్ కాస్ట్స్ (SC
“ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఉపవర్గీకరణ) చట్టం, 2025” ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. షెడ్యూల్డ్ కాస్ట్స్ (SC) వర్గాల్లో ఉపవర్గీకరణ చేసే చట్టం గవర్నర్ ఆమోదం పొందింది.
ఈ చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చట్టం నంబర్ 22/2025 గా సంఖ్య కేటాయించబడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టానికి గవర్నర్ అక్టోబర్ 17న రాజముద్ర వేశారు. తాజాగా జీవో విడుదల కావడంతో ఉపవర్గీకరణ జరగనుంది. జనాభా ప్రాతిపదికన ఉపవర్గీకరణ ఉండనుంది.