News9th Sep 10:27 AMSunil Byrisetty1 min read

వారికి దసరాకు ముందే పండుగ.. డబ్బులు జమ!

రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకూ డీఏ బకాయిలు జమ చేశారు. మిగతా ఉద్యోగులకు కూడా ఆరు విడతల

వారికి దసరాకు ముందే పండుగ.. డబ్బులు జమ!
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకూ డీఏ బకాయిలు జమ చేశారు. మిగతా ఉద్యోగులకు కూడా ఆరు విడతల్లో డీఏ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి.. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. అప్పటి వరకూ పోరాడతామని సంఘం స్పష్టం చేసింది.
AP Government
CPS Employees
DA Arrears
Government Jobs
Employee Welfare
DA Update
State Employees
Employee Union
ఉద్యోగ సంఘం
పింఛను విధానం
సీపీఎస్
Scroll for the next article