News23rd Aug 09:28 AMSunil Byrisetty1 min read

బధిరులకు ఉచిత ఫోన్లు

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ

బధిరులకు ఉచిత ఫోన్లు
బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. అందుకోసం కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసుపైన, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు apdascac.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులుగా గుర్తించిన వారికి ఉచితంగా సెల్ ఫోన్లు అందించనున్నారు.
AP Government Scheme
Free Mobile Phones
Hearing Impaired
Disabled Welfare
Andhra Pradesh News
Free Smartphone Scheme
AP Differently Abled Welfare
వికలాంగులకు సాయం
చెవిటి మూగలకు ఫోన్లు
Scroll for the next article