News20th May 06:02 PMSunil Byrisetty1 min read
రేషన్ వాహనాలు రద్దు.. షాపుల్లో పంపిణీ
రేషన్ కార్డుదారులకు ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేషన్ అందించే MDU వాహనాలను రద్దు చేసింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వ
రేషన్ కార్డుదారులకు ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రేషన్ అందించే MDU వాహనాలను రద్దు చేసింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించి వాహనాల యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.
బియ్యం ఇచ్చే రోజులు కాక, మిగతా రోజుల్లో వాహనాలను వాళ్ళే వాడుకుంటున్నారని గుర్తించింది.
ఈ నేపథ్యంలో రేషన్ సరుకులను రేషన్ దుకాణాల్లో నే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అంతే కాకుండా ప్రస్తుత విధానంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని పలువురు మంత్రులు తెలిపారు.
అలాంటివి జరగకుండా రేషన్ స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై చర్చించారు.
త్వరలోనే విధివిధానాలు ప్రకటించనున్నారు.