News12th Jan 03:53 PMSunil Byrisetty1 min read
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కమి
పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన పి శ్రీనివాసులును.. మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఇక మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రోణంకి గోపాలకృష్ణకు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్‌ను పౌర సరఫరాలు, ఎక్స్-అఫీషియో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. కల్పనా కుమారిని గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, ఏడీఎంగా బదిలీ చేశారు. కఠావటే మయూర్ అశోక్ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్, ఏడీఎం నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. కాగా, కడప జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య.