News3rd Mar 01:18 PMSunil Byrisetty1 min read
అర్హులైన పేదలందరికీ ఇళ్లు
రాష్ర్టంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు స
రాష్ర్టంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలను అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70, 232 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా మా ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందన్నారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందని వివరించారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని ఆరోపించారు. లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇళ్ల పట్టాల కోసం భూముల కోనుగోలు లోనూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి అనగాని పేర్కొన్నారు.