Politics24th Oct 05:17 PMSunil Byrisetty1 min read

జగన్ కట్టి ఉంటే ఇప్పుడు పీపీపీ ఎందుకు?

పీపీపీ విధానంలో 10 కళాశాలను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తే, జగన్ విమర్శిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ ప్రతిసారి 17 మెడిక

జగన్ కట్టి ఉంటే ఇప్పుడు పీపీపీ ఎందుకు?
పీపీపీ విధానంలో 10 కళాశాలను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తే, జగన్ విమర్శిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ ప్రతిసారి 17 మెడికల్ కళాశాలలు కట్టేసినట్లు చెబుతుంటారని, ఒకవేళ నిర్మించి ఉంటే ఇంకా పీపీపీ గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదని వ్యాఖ్యానించారు. 17 మెడికల్ కళాశాలల కోసం రూ. 8480 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే, నాలుగేళ్లలో 1550 కోట్లు మాత్రమే జగన్ ఖర్చు పెట్టారు, కానీ పూర్తి చేసినట్లు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నాలుగేళ్లలో కళాశాలలు నిర్మించడంలో విఫలమై ప్రజల్లోకి వెళ్లి చెబుతామంటున్నారని, కట్టలేకపోయామని చెబుతారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అయిందని, సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని వివరించారు. గత ప్రభుత్వమే కళాశాలలు నిర్మించి ఉంటే, ఇప్పుడు పీపీపీ మోడల్ తేవాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్ షిప్ అని, కానీ దీన్ని ప్రైవేటేజేషన్ అన్నట్లు జగన్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
YS Jagan
PPP Model
Medical Colleges
Satyakumar Yadav
State Government
విద్యా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం
రాజకీయాలు
నిర్మాణ కార్యక్రమాలు
Scroll for the next article