Sports19th Apr 03:41 PMSunil Byrisetty1 min read
క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు
ఏపీలో క్రీడాకారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయించినట్లు క్రీడాశాఖ మంత్రి మ
ఏపీలో క్రీడాకారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయించినట్లు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ రిజర్వేషన్ అమలుకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశామన్నారు.
ఈ విధానంతో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖలతో సహా యూనిఫార్మ్డ్ సర్వీసులలో క్రీడాకారులకు పోటీ పరీక్షలకు నేరుగా నియామక అవకాశాలు లభించనున్నాయి.
మొత్తం 65 క్రీడా విభాగాలు ఈ ప్రత్యక్ష నియామకాల్లో భాగస్వామ్యమవుతున్నాయి.
క్రీడాకారుల భవిష్యత్తే తమ ధ్యేయమని. ప్రణాళికాబద్ధంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.