Politics6th Mar 05:07 PMSunil Byrisetty1 min read
మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక
పౌరసేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ఎపి ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి 30
పౌరసేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ఎపి ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలందిస్తోంది.
ఈ ఏడాది జనవరి 30వతేదీన మంత్రి లోకేష్ చేతులమీదుగా దేశంలోనే తొలిసారిగా 161రకాల పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర...
కేవలం 50రోజుల్లోనే 200సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించింది.
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు.
పౌరసేవలను సమర్ధవంతంగా, సులభతరంగా అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు సౌలభ్యంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్ 22న డిల్లీలో మంత్రి లోకేష్ మెటా ప్రతినిధులతో ఎపి ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకున్నారు.
ఇటీవల టెన్త్, ఇంటర్ విద్యార్థుల తమ హాల్ టిక్కెట్లను సైతం వాట్సాప్ ద్వారా పొందగలిగారు.
ప్రజలు వివిధ రకాల పౌరసేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మన మిత్ర నెం. 9552300009 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ప్రస్తుతం 200 రకాల పౌర సేవలను ఎపి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.