News13th Sep 05:29 PMSunil Byrisetty1 min read

వర్షాలతో వ్యాధుల ముప్పు పెరగకుండా అప్రమత్తం

వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మలేరియా, డెంగ్యూ, స్క్రబ్‌ టైఫస్‌, టైఫాయిడ్‌, నీరు–ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన

వర్షాలతో వ్యాధుల ముప్పు పెరగకుండా అప్రమత్తం
వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మలేరియా, డెంగ్యూ, స్క్రబ్‌ టైఫస్‌, టైఫాయిడ్‌, నీరు–ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పరిస్థితిపై వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ, దోమతెరల పంపిణీ, దోమల పిల్లల నిర్మూలనను ముమ్మరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో వెంటనే దోమల నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి దోమల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘Dry Day’ (ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి నీటిని తొలగించే కార్యక్రమం)ను నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యంతో దోమల పెరుగుదల ప్రాంతాలను తొలగించాలని మంత్రి పేర్కొన్నారు. కేసులు కేసులు నమోదు పరిమితికి మించి పెరుగుతున్నప్పుడు వెంటనే అలర్టులు అన్ని స్థాయిలోని వారికి వచ్చేలా వ్యవస్థను రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.
Andhra Pradesh Health Department
Satyakumar Yadav
Rainy Season Diseases
Malaria
Dengue
Scrub Typhus
Typhoid
Mosquito Control
వ్యాధుల నివారణ
గిరిజన ప్రాంతాలు
ప్రజారోగ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వైద్య ఆరోగ్య మంత్రి
Scroll for the next article