News10th May 09:32 AMSunil Byrisetty1 min read

జగన్.. జెడ్ ప్లస్.. హైకోర్టులో పిటిషన్!

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనకు సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీతో భద్రత కల్పించాలని జ

జగన్.. జెడ్ ప్లస్.. హైకోర్టులో పిటిషన్!
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనకు సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీతో భద్రత కల్పించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. తనకు జెడ్‌ప్లస్‌ భద్రత పునరుద్ధరించేలా, ఎన్‌ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణనలోకి తీసుకొనేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ జరగ్గా.. జగన్‌కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పిటిషనర్ తరఫున లాయర్ వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల ఘటనలు చూస్తే పిటిషనర్‌ భద్రత ప్రమాదంలో ఉందని.. అందుకే కేంద్ర హోంశాఖకు వినతులు సమర్పించామన్నారు. భద్రత కుదింపుపై హైకోర్టులో గతంలోనూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తెలిపారు.
Andhra Pradesh
Ys Jagan Mohan Reddy
high court petition
Z Plus Security
వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
హైకోర్టులో పిటిషన్
సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీతో భద్రత
Scroll for the next article