News6th Jul 03:39 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియా కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియా కేసుల విచారణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధించాలని సూచించారు. సోషల్ మీడియాలో అన
సోషల్ మీడియా కేసుల విచారణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధించాలని సూచించారు. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.