News5th Jun 03:24 PMSunil Byrisetty1 min read

విద్యార్థుల హాజరుపై హైకోర్టు సంచలన తీర్పు

విద్యార్థుల హాజరు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనారోగ్యం వల్ల తరగతులకు పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. వ

విద్యార్థుల హాజరుపై హైకోర్టు సంచలన తీర్పు
విద్యార్థుల హాజరు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనారోగ్యం వల్ల తరగతులకు పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి గతేడాది అనారోగ్యంతో కొన్ని రోజులు క్లాసులకు హాజరు కాలేకపోయాడు. హాజరు తక్కువగా ఉందని కాలేజీ యజమాన్యం మూడో సెమిస్టర్ పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కనీసం నాలుగో సెమిస్టర్ క్లాసులకైనా హాజరయ్యే అవకాశం కల్పించాలని కోర్టును కోరాడు. విచారణ చేపట్టిన హైకోర్టు అనారోగ్యం కారణంగా కౌశిక్ తరగతులకు హాజరు కాలేదని, హాజరు శాతాన్ని ఆధారంగా చేసుకుని పరీక్షల అర్హతను నిరాకరించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. కౌశిక్‌కు పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలని ఆదేశించడంతోపాటు, తదుపరి తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించింది.
Andhra Pradesh news
High Court
Colleges
Students Attendance
విజయనగరం జిల్లా
విద్యార్థుల అటెండెన్స్‌పై స్పందన
బీవీకే కౌశిక్
Scroll for the next article