Politics11th Mar 05:39 PMSunil Byrisetty1 min read

హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలి: సీపీఎం

ప్రజలు వ్యతిరేకిస్తున్నా బల్క్‌ డ్రగ్‌ పార్కు పనులకు ప్రభుత్వం సిద్ధపడుతోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి

హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలి: సీపీఎం
ప్రజలు వ్యతిరేకిస్తున్నా బల్క్‌ డ్రగ్‌ పార్కు పనులకు ప్రభుత్వం సిద్ధపడుతోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, 2013 చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రి అనితను కలిస్తే దిక్కున్న చోట చెప్పుకోవాలని చెప్పారని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గ పరిధిలో ఈ పార్కుకు శంకుస్థాపన జరగనుండడంతో పోలీసులను మోహరించి భూమిని చదును చేయించారు. ఇలాంటి దౌర్జన్యం చేసే దురహంకార ప్రవర్తన మంచిది కాదన్నారు. దిక్కున్న చోట చెప్పుకొనే అవసరం తమకు లేదని, రోడ్డుపై కూర్చుంటే ప్రభుత్వమే దిగొస్తుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై అహంకారం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాళ్లావేళ్లా పడి ఓట్లడిగే నేతలు ఇలా వ్యవహరించడం తగదన్నారు. హోంమంత్రి అనిత నియోజకవర్గం కనుక పరిహారం విషయంలో ఆమె పూర్తి బాధ్యత తీసుకుని ఇప్పించాలని డిమాండ్ చేశారు.
V Srinivasa Rao CPM
Vangalapudi Anitha
Andhra Pradesh
అనిత
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
Scroll for the next article