Education8th May 03:11 PMSunil Byrisetty1 min read
ఇంటర్ సప్లిమెంటరీ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియ
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారుల సమావేశం జరిగింది.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు.
మొదటి సంవత్సరానికి సంబంధించి బెటర్‌మెంట్ రాసే విద్యార్థులతో కలుపుకొని మొత్తం 28,909 మంది విద్యార్థులకు 73 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
అదేవిధంగా 5,565 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 23 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు సిటింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరుగుతోందన్నారు.
పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతిదశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.