News13th Dec 03:14 PMSunil Byrisetty1 min read
ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానం
ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్ పో లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భ
ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్ పో లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని, భారత్ లో పెట్టుబడులు ఎలా పెట్టాలని, భారత్ మార్కెట్ లో ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని.. ఈ మేరకు ఎన్డిఏ ప్రభుత్వం, ప్రధాని మోడీ పని చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీ, ఏరో స్పేస్, బయో టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేశారని వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు వెళ్లి ఉన్న సమస్యలు అక్కడ వివరిస్తే, మీ పారిశ్రామిక భవిష్యత్తుకు కావాల్సిన పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అందరూ వాడుకోవాలని మంత్రి కోరారు.