Education22nd Oct 12:47 PMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు

విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్ లో ముందువరుసలో ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంట

ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్ లో ముందువరుసలో ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని, ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్‌, రోబోటిక్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్ లర్ మార్క్ హార్వే తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
AI education
high school curriculum
Nara Lokesh
education reforms
AI labs
STEM
robotics
ఏఐ యూనివర్సిటీ
సాంకేతిక విద్య
పాలన
భారత్
Scroll for the next article