News8th Jun 11:27 AMSunil Byrisetty1 min read
స్మార్ట్ మీటర్లపై నివేదికకు ఆదేశం
స్మార్ట్ మీటర్ల బిల్లులపై వస్తున్న ఆరోపణలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. క్షేత్ర స్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరుపై విచారణకు ఆదేశించారు. సోమవారం నాటికి సమగ
స్మార్ట్ మీటర్ల బిల్లులపై వస్తున్న ఆరోపణలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. క్షేత్ర స్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరుపై విచారణకు ఆదేశించారు. సోమవారం నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ మీటర్‌తో బిల్లు ఎక్కువ వచ్చిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల పని తీరుపై విచారణకు ఆదేశించామన్నారు. ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.