News20th Sep 06:26 PMSunil Byrisetty1 min read
పర్యాటక రంగంలో పెట్టుబడులకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక, ఆతిథ్య రంగాలకు స్వర్గధామం అని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక, ఆతిథ్య రంగాలకు స్వర్గధామం అని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు స్పష్టం చేశారు. బెంగుళూరులోని హోటల్ కాన్రాడ్ లో సెప్టెంబర్ 18-20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఐఏఎస్, నోడల్ ఆఫీసర్(పెట్టుబడులు) సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుస్థిర పర్యాటక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, నూతన పర్యాటక పాలసీ 2024-29, ఏపీ పర్యాటకానికి పారిశ్రామిక హోదా, పర్యాటక రంగంలో పెట్టుబడుల అవకాశాలను ఏపీ బృందం వివరించింది. రాష్ట్రంలో 55వేల గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. విభిన్న పర్యాటక ప్రక్రియల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అణువైన ప్రాంతమని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీని పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి భరోసా ఇచ్చే బాధ్యత తమది అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.