News12th Oct 03:39 PMSunil Byrisetty1 min read

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం

‘గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్కృతి అప్పట్లో ఉండేది. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం
‘గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్కృతి అప్పట్లో ఉండేది. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోంది. మీరు పెట్టుబడులుపెడితే రాష్ట్రానికి ఏం ఇస్తారు..? ప్రజలకు ఏం చేస్తారు అని అడిగి సత్సంప్రదాయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ పురోగతిలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘విశ్రాంత ఉద్యోగుల ప్యారడైజ్ నగరంగా భావించే కాకినాడలో తొలిసారి సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగడం ఆనందంగా ఉంది. విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో రెండో ప్రాంతీయ సదస్సుకు కాకినాడ వేదిక కావడం గొప్ప మైలురాయి. కాకినాడ పారిశ్రామిక ప్రగతి చరిత్రలో రూ.6,347 కోట్ల పెట్టుబడులు రావడం కొత్త అవకాశాలకు పునాది వేస్తుంది. ఈ ప్రాంతం మరింత పురోగతి చెందడానికి ఇది ఇంధనంగా పని చేస్తుంద’ని పేర్కొన్నారు.
Scroll for the next article