News30th May 09:03 AMSunil Byrisetty1 min read
అక్రిడేషన్ గడువు మూడు నెలల పెంపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మే 31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు పెంచారు. జూన్ 1, 2025 నుంచి ఆగష్టు 31, 2025 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల తెలియజేశారు.