News28th Jul 04:51 PMSunil Byrisetty1 min read

హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్

హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద్ బట్టు రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఈయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13వరకు ఉంది. జస్టిస్ దేవానంద్ గతంలోనూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. అమరావతి రైతుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై రాజధాని ప్రాంతంలో హర్షం వ్యక్తమైంది. కాగా జస్టిస్ దేవానంద్ మద్రాస్ న్యాయస్థానం నుంచి బదిలీపై తిరిగి ఏపీ హైకోర్టుకు వచ్చారు.
Andhra Pradesh High Court
Justice Battu Devanand
Judge Sworn In
Justice Dheeraj Singh Thakur
Amaravati Farmers
Madras High Court Transfer
జస్టిస్ బట్టు దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
Scroll for the next article