News15th Jul 03:09 PMSunil Byrisetty1 min read
హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు. దేవానంద్‌ను పదోన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు. దేవానంద్‌ను పదోన్నతిపై ఏపీకి బదిలీ చేయాలనే సుప్రీం కొలీజియం నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన దేవానంద్ బదిలీ అయినప్పుడు రైతులందరూ వీడ్కోలు పలికారు. దేవానంద్ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి లా పట్టా పొందారు.