News14th Aug 03:51 PMSunil Byrisetty1 min read
అన్ని చోట్లా ఆగష్టు 15 స్వాతంత్ర్య వేడుకలు
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 15వతేదీ శుక్రవారం ఉదయం 8గం.లకు రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 15వతేదీ శుక్రవారం ఉదయం 8గం.లకు రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 15వతేది శుక్రవారం ఉదయం 8.15 గం.లకు రాష్ట్ర శాసన సభ భవనం ముందు జరిగే వేడుకల్లో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మరోవైపు రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉ.7.30 గం.లకు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద 15వ తేది ఉ.10 గం.లకు జరిగే స్వాతంత్ర్య దినోత్సన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.