Politics18th Mar 04:58 PMSunil Byrisetty1 min read

ఫొటో సెషన్‌లో సరదా సీన్లు!

ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సరదా సన్నివేశాలు కనిపించా

ఫొటో సెషన్‌లో సరదా సీన్లు!
ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సరదా సన్నివేశాలు కనిపించాయి. పార్టీలకతీతంగా నేతలు కూర్చుని ఫొటో దిగే సమయంలో సరదాగా మాట్లాడుకున్నారు. ‘మీతో ఫొటో దిగడం నా అదృష్టం అంటూ చంద్రబాబుతో డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం వ్యాఖ్యానించగా ఆ మాటలకు వైసీపీ ఎమ్మెల్సీలు ఖంగు తిన్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాపై ఓడిన కేఎస్ లక్ష్మణరావు మీతో విడిగా ఫొటో దిగాలంటూ సీఎం చంద్రబాబును కోరారు. లక్ష్మణరావు అడిగిన వెంటనే సీఎం పిలిచి ఫొటో దిగారు. మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వట్లేంటూ సీఎం, ఛైర్మన్ సమక్షంలో మంత్రి నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించగా.. పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు. ఫొటో సెషన్ సందర్భంగా తనకు ముందు వరుసలో అవకాశం ఉందా అని వైసీపీ మండలిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడుగగా.. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఉందని చెప్పారు. అయితే పొరపాటున వేరే కుర్చీలో కూర్చున్న బొత్సను లేవమనకుండా డిప్యూటీ సీఎం పవన్ కోసం మంత్రి నారా లోకేష్ మరో కుర్చీ ఏర్పాటు చేయించారు.
AP Assembly
ChandrababuNaidu
AndhraPradesh
ఏపీ అసెంబ్లీ
చంద్రబాబునాయుడు
ఆంధ్ర ప్రదేశ్
Scroll for the next article