News12th Aug 01:34 PMSunil Byrisetty1 min read

మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి జగనే

ఏపీలో 2019-24 మధ్య ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి(జగన్‌) పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్‌లో సిట్‌ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమ

మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి జగనే
ఏపీలో 2019-24 మధ్య ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి(జగన్‌) పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్‌లో సిట్‌ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏయే నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జిషీట్‌లో సిట్‌ పేర్కొంది. మద్యం కుంభకోణంలో సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కాల్వ ధనుంజయరెడ్డి (ఏ-31), జగన్‌ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ (ఏ-33) ప్రమేయం, పాత్రకు సంబంధించి సిట్‌ పలు అభియోగాలను మోపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. మొత్తం ఇంచుమించు 124 పేజీలు 16కి పైగా వాల్యూమ్‌లతో దీనిని సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగపత్రంలో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై సిట్‌ అభియోగాలను నమోదు చేసింది.
AP Liquor Scam
Jagan Mohan Reddy
SIT Supplementary Chargesheet
AP Politics
Corruption Case
ACB Court Vijayawada
Illegal Liquor Trade
సీఎంవో అధికారులు
భారతి సిమెంట్స్‌
కాల్వ ధనుంజయరెడ్డి
Scroll for the next article