Politics20th Mar 01:57 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థల ఉపఎన్నికలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను పరోక్ష పద్ధతిలో భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27న ఉప ఎన్నికలు నిర్వహించనుంది. కడప జెడ్పీ ఛైర్పర్సన
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను పరోక్ష పద్ధతిలో భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 27న ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
కడప జెడ్పీ ఛైర్పర్సన్, కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్ పదవులకు ఎన్నికలు జరపనుంది.
అలాగే ఎంపీపీలు - 28, వైస్ ఎంపీపీలు - 19, మండల ప్రజాపరిషత్లో కోఆప్టెడ్ సభ్యులు - 12 పదవులు భర్తీ కానున్నాయి.
వీటితోపాటు వివిధ జిల్లాల్లో 214 ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనుంది.
పదవుల భర్తీకి వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది.
పూర్తి వివరాలకు ఆయా జిల్లా ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించింది.