News1st Jun 05:57 PMSunil Byrisetty1 min read
కొవిడ్ పై అప్రమత్తం
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్ట
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్టులో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.
మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పటల్లో కొవిడ్ ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్యానికి వైద్యపరికారాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలంతా మాస్క్, శానిటేషన్, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనవచ్చన్నారు