News19th Aug 09:29 AMSunil Byrisetty1 min read

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు శుభాకాంక్ష‌లు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ ను విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైననందుకు మంత్రి నారా

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్  కు శుభాకాంక్ష‌లు
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ ను విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైననందుకు మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహచర ఎంపీలు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ఎన్డీయే కూట‌మి త‌రఫున ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్ధిగా ఎంపిక కావ‌టం ఆనందంగా వుంద‌న్నారు. త‌మిళ‌నాడు రాష్ట్రానికి 7వ బిజెపి అధ్య‌క్షుడిగా వుండి బిజెపి ఎదుగుద‌ల‌కు ఎన‌లేని కృషి చేశార‌ని, అలాగే కోయంబ‌త్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచార‌న్నారు. ప్ర‌స్తుతం మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న రాధాకృష్ణ‌న్ గ‌తంలో ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కూడా చేసిన అనుభ‌వం వుంద‌న్నారు. ఆ రాష్ట్రాల్లో అధికార, విప‌క్షాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌టంలో కీల‌క పాత్ర పోషించిన రాధాకృష్ణ‌న్ రాజ్య‌స‌భ‌ను స‌జావుగా నిర్వ‌హించ‌గ‌ల స‌మ‌ర్ధ‌డంటూ కొనియాడారు.
Andhra Pradesh
C.P. Radhakrishnan
NDA Vice President candidate
Nara Lokesh Delhi meeting
Vice President elections
Jharkhand Governor
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఉపరాష్ట్రపతి ఎన్నికలు
Scroll for the next article