Education13th Mar 01:44 PMSunil Byrisetty1 min read

హెడ్మాస్టర్ గారూ.. హ్యాట్సాఫ్ అన్న మంత్రి లోకేష్

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత ర‌మ‌ణను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. అందుకు కారణం ఆ హెడ్మాస్టర్ వినూత్నంగా చేసిన పని లోకేష్‌ను ఆకట్టుక

హెడ్మాస్టర్ గారూ.. హ్యాట్సాఫ్ అన్న మంత్రి లోకేష్
విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత ర‌మ‌ణను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. అందుకు కారణం ఆ హెడ్మాస్టర్ వినూత్నంగా చేసిన పని లోకేష్‌ను ఆకట్టుకోవడమే. సాధారణంగా విద్యార్థులు అల్లరి చేస్తే మందలిస్తారు, లేదంటే రెండు దెబ్బలు వేస్తారు. కానీ హెడ్మా్స్టర్ చింత రమణ కొట్టలేదు, తిట్టలేదు. ఆయనే స్వయంగా గుంజీలు తీశారు. అది కూడా ఆ పాఠశాలలోని పిల్లలందరి ముందు తీశారు. ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో స్వయంగా ట్వీట్ చేశారు. ‘‘హెడ్మాస్టర్ గారు పిల్లల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని .. విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా నా దృష్టికి వ‌చ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌క్రమ‌శిక్షణ చ‌ర్య ఆలోచ‌న బాగుంది. అభినంద‌న‌లు. అంతా క‌లిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భ‌విష్యత్తుకు బాట‌లు వేద్దాం.’’ అని మంత్రి లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.
Andhra Pradesh
Vizianagaram Head Master Video
Education
విజ‌య‌న‌గ‌రం
హెడ్మా్స్టర్
Scroll for the next article