News30th Mar 09:44 AMSunil Byrisetty1 min read

ఏఐ స్టార్టప్ నెలకొల్పి స్ఫూర్తిగా దివ్యాంగ విద్యార్థి

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గతంలో ఎన్ఐటీ కాలికట్ లో సీటు పొందిన దివ్యాంగ విద్యార్థి సి.రఘునాథరెడ్డి ఏఐ స్టార్టప్ ను నెలకొల్పి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. గతేడాది జ

ఏఐ స్టార్టప్ నెలకొల్పి స్ఫూర్తిగా దివ్యాంగ విద్యార్థి
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గతంలో ఎన్ఐటీ కాలికట్ లో సీటు పొందిన దివ్యాంగ విద్యార్థి సి.రఘునాథరెడ్డి ఏఐ స్టార్టప్ ను నెలకొల్పి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. గతేడాది జులైలో దేశవ్యాప్తంగా వివిధ ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్ అప్ లోడ్ విషయంలో సమస్య ఎదురైంది. సదరు సమస్యను వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో మెరుపు వేగంతో స్పందించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేసి 25 మంది విద్యార్థుల భవిష్యత్ ను కాపాడారు. దీంతో వారంతా పేరెన్నికగన్న ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. మంత్రి చొరవతో విజయవాడకు చెందిన సి.రఘునాథరెడ్డి ఎన్ఐటీ కాలికట్ లో సీటు పొందాడు. తన ప్రతిభతో ఇటీవల విద్యార్థులో నైపుణ్యం, నెట్ వర్కింగ్ సామర్థ్యాల పెంపునకు ఎన్ఐటీ స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రోత్సాహంతో ఏఐ స్టార్టప్ ను నెలకొల్పాడు. గతంలో మంత్రి లోకేష్ ఇచ్చిన సహకారం, మార్గదర్శకం వల్లే రాణించగలగుతున్నానని రఘునాథరెడ్డి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. రఘునాథరెడ్డి ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్.. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మీ విజయంలో నేను చిన్న పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏఐ స్టార్టప్ ను నెలకొల్పిన రఘునాథరెడ్డిని, బృందాన్ని మంత్రి అభినందించారు.
Minister Nara Lokesh
Raghunath Reddy
Education
Disabled Students
Scroll for the next article