News20th Apr 01:30 PMSunil Byrisetty1 min read

అమరావతి విగ్రహాలు.. గుజరాత్ నమూనా!

ఏపీ మంత్రి నారాయణ బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయో

అమరావతి విగ్రహాలు.. గుజరాత్ నమూనా!
ఏపీ మంత్రి నారాయణ బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా పరిశీలించారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ బృందం అధ్యయనం చేసింది.
Amaravati Development
Minister Narayana
Gujarat
పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ బృందం అధ్యయనం
సాంకేతికత
మెటీరియల్
Scroll for the next article