Politics9th May 12:16 PMSunil Byrisetty1 min read
ఈడీకి థాంక్స్ చెప్పిన సోమిరెడ్డి
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి థాంక్స్ చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదని, ఇది రూ.10 వేల కోట్ల
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి థాంక్స్ చెప్పారు.
ఏపీ లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదని, ఇది రూ.10 వేల కోట్లకు పైగా కుంభకోణమని తాను ముందే చెప్పానన్నారు.
మనీ లాండరింగ్ కూడా జరిగిందని, బోఫోర్స్, 2జీలతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లకు మించిన కుంభకోణమని కూడా వెల్లడించానన్నారు. ఈడీ రంగంలోకి దిగితే బండారం మొత్తం బయట పడుతుందని గత నెల 25వ తేదీన పేర్కొన్నానని గుర్తు చేశారు. ఎట్టకేలకు ఎంటరైన ఈడీకి ధన్యవాదములు అంటూ ప్రకటించారు.