Politics28th Mar 02:36 PMSunil Byrisetty1 min read
ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉగాది నాటికి నామినేటెడ్ పదవులన్నీ ప్రకటిస్తామని ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రకటించా
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఉగాది నాటికి నామినేటెడ్ పదవులన్నీ ప్రకటిస్తామని ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
తాజాగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తూ ఆ జాబితా విడుదల చేసింది.
47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పదవుల కోసం అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతోపాటు, కష్టపడిన వారికి పెద్దపీట వేసింది.
ప్రకటించిన 47 ఏఏంసి ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రభుత్వం ప్రకటించనుంది.