Politics9th Nov 10:37 AMSunil Byrisetty1 min read
పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం
ఏపీలో పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం అయింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 26న తొలి విడత పోలింగ్, ఫలితాలు
ఏపీలో పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం అయింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 26న తొలి విడత పోలింగ్, ఫలితాలు విడుదలవుతాయి. ఈనెల 16న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈనెల 29న రెండో విడత పోలింగ్, ఫలితాలు రానున్నాయి. ఈనెల 19న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతాయి. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. మూడు విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత నామినేషన్లకు ఈనెల 17న చివరి తేదీగా పేర్కొన్నారు. రెండో విడత నామినేషన్లకు ఈనెల 20, మూడో విడత నామినేషన్లకు ఈనెల 23న చివరి తేదీగా ప్రకటించారు.