Health28th Jul 02:51 PMSunil Byrisetty1 min read

ఏపీకి ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ

ఏపీకి పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రానున్నాయి. ఏపీ ప్రభుత్వంతో అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు అవగాహనా ఒప్

ఏపీకి ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ
ఏపీకి పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రానున్నాయి. ఏపీ ప్రభుత్వంతో అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటుకు అస్ట్రాజెనెకా ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానం ప్రారంభించేందుకు వీలుగా కీలకమైన అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఆస్ట్రాజెనెకా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఒప్పందం లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
N Chandrababu Naidu
AstraZeneca India
Strand Life Sciences
Qure.ai
Healthcare
Biotechnology
జెనోమిక్ సొల్యూషన్స్
క్యాన్సర్ చికిత్స
బయోమార్కర్ టెస్టింగ్
Scroll for the next article