News22nd Sep 01:40 PMSunil Byrisetty1 min read
ఏపీలో భారీ ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్
ఉక్కు కర్మాగారాలు, డేటా సెంటర్లు, స్పేస్ క్లస్టర్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి వార్తల్లో నిలుస్తున్న వేళ.. మరోవైపు ఆహార ప్రాసెసింగ్ రంగంలోనూ భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపా
ఉక్కు కర్మాగారాలు, డేటా సెంటర్లు, స్పేస్ క్లస్టర్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి వార్తల్లో నిలుస్తున్న వేళ.. మరోవైపు ఆహార ప్రాసెసింగ్ రంగంలోనూ భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు బాటలు పడుతున్నాయి. ముడి వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రూ.16,502 కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్‌తో 2.31 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ రూపుదిద్దుకుంటోంది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇప్పటికే సత్ఫలితాలనిస్తున్నాయి.. మొత్తం రూ.16,502 కోట్ల పెట్టుబడులు, సుమారు 2.31 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ఇందులో 1,478 ఎంఎస్ఎంఈ, భారీ పరిశ్రమల యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 10 ఫుడ్ పార్కుల ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి.